Mrunal Thakur: మృణాల్‌తో డేటింగ్‌..! స్పందించిన సింగర్‌..

మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)తో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై సింగర్ బాద్‌షా (Badshah) స్పందించారు. ఇన్‌స్టాలో ఈ విషయంపై నోట్‌ రాశారు.

Published : 14 Nov 2023 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు రోజుల నుంచి నటి మృణాల్‌ ఠాకూర్‌ పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీపావళి సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలే ఇందుకు కారణం. ఆ ఫొటోల్లో ఆమె బాద్‌షా అనే సింగర్‌తో చనువుగా ఉన్నట్లు కనిపించారు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది.

దీపావళి సందర్భంగా బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. దానికి మృణాల్‌, బాద్‌షా హాజరయ్యారు. అందులో శిల్పా శెట్టి, బాద్‌షాలతో దిగిన ఫొటోలను మృణాల్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘నాకు అత్యంత ఇష్టమైన వారు’ అని క్యాప్షన్‌ రాశారు. ఇక పార్టీ అయ్యాక కూడా ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై సింగర్ బాద్‌షా స్పందించారు. ‘డియర్‌ ఇంటర్నెట్‌. మరోసారి నిరాశపరుస్తున్నందుకు క్షమించు. ప్రస్తుతం వస్తోన్న వార్తలేవీ నిజం కాదు’ అంటూ ఫన్నీ ఎమోజీని పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లైంది. అసలు ఈ  బాద్‌షా ఎవరంటే.. బాలీవుడ్‌ సింగర్‌, యాక్టర్‌. అతడి అసలు పేరు ఆదిత్య ప్రతీక్‌ సింగ్‌. పాడిన తొలి పాటతోనే అత్యధిక వ్యూస్‌ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎందుకిలా చేశావ్‌.. వరుణ్ తేజ్‌ పెళ్లిపై సాయి ధరమ్ తేజ్‌ ఫన్నీ పోస్ట్‌

ఇక మృణాల్‌ పెళ్లిపై ఇటీవల కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. వాటిని ఖండిస్తూ ఆమె స్వయంగా వీడియో విడుదల చేశారు. ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోనున్నారంటూ వచ్చిన వార్తలను అప్పట్లోనే మృణాల్‌ ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని