kgf 2: స్పెషల్ భామలు వీళ్లేనా?
కేజీయఫ్2లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నాయికలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లను పరిశీలిస్తున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీయఫ్: చాప్టర్ 2’. 2018లో వచ్చి, విజయవంతమైన ‘కేజీయఫ్: చాప్టర్ 1’కి కొనసాగింపు చిత్రమిది. కోలార్ బంగారు గనులు నేపథ్యంగా సాగే హైఓల్టేజ్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇందులో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిందులో ఓ ప్రత్యేక గీతం కోసం మరో ఇద్దరు భామల్ని రంగంలోకి దింపుతున్నటు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ నాయికలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లను పరిశీలిస్తున్నారు.
‘కేజీయఫ్’ తొలి భాగంలోనూ ఓ ప్రత్యేక గీతముంది. ఆ పాటకు దక్షిణాది భాషల్లో తమన్నా కాలు కదపగా.. హిందీలో మౌనీ రాయ్‌తో తెరకెక్కించారు. ఇప్పుడీ రెండో భాగం కోసం ఇదే పంథాలో ఇద్దరు భామల్ని రంగంలోకి దించాలా? లేక ఒకరితోనే చేయించాలా? అని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఒకరితోనే ఆ పాట తెరకెక్కించే ప్రయత్నం చేస్తే.. జాక్వెలిన్, నోరాల్లో ఒకరినే తీసుకునే అవకాశముంది. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.