KGF Chapter 3: ‘రాకీభాయ్‌’ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్‌ భామలు

యశ్‌(Yash) కథానాయకుడిగా నటించిన కేజీయఫ్‌: ఛాప్టర్‌2(KGF2) బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

Published : 21 Jun 2022 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యశ్‌(Yash) కథానాయకుడిగా నటించిన కేజీయఫ్‌: ఛాప్టర్‌2(KGF2) బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ హై వోల్టేజి యాక్షన్‌ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పార్ట్‌-2 చివరిలో హింట్‌ ఇచ్చారు. దీంతో అభిమానులు ‘కేజీయఫ్-ఛాప్టర్‌3’పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

మరోవైపు ఈ పార్ట్‌లో కథానాయికగా ఎవరు నటిస్తారన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఛాప్టర్‌-2లో శ్రీనిధి శెట్టి పాత్ర చనిపోవడంతో ఆ క్యారెక్టర్‌ ముగిసింది. దీంతో కొత్త హీరోయిన్‌ అవసరముంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్‌ భామలు ‘కేజీయఫ్‌-3’లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కాలంటే  ‘కేజీయఫ్‌’లాంటి ఒక్క చిత్రం చాలు. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ప్రస్తుతం  స్క్రిప్టు దశలో ఉన్న ఛాప్టర్‌3 సెట్స్‌ పైకి వెళ్లేది ఎప్పుడు? అనే విషయం ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని