Prabhas: ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో మరో సినిమా.. వివరాలు చెప్పిన దిల్‌ రాజు

‘సలార్‌’ (Salaar) తర్వాత ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel), ప్రభాస్‌ల కలయికలో మరో సినిమా రానుందని నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) తెలిపారు. ఓ పౌరాణిక సినిమా అని అన్నారు.

Published : 12 Apr 2023 14:00 IST

హైదరాబాద్‌: ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ‘సలార్‌’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిర్మాత దిల్‌ రాజు అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. ‘సలార్‌’ తర్వాత ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కలిసి మరో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు.

ఓ ఇంటర్వ్యూలో దిల్‌ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ల కాంబోలో ఓ పౌరాణిక సినిమా రానుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ‘సలార్‌’తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీయనున్నారు. ఇవ్వన్నీ పూర్తయ్యాక ప్రభాస్‌ సినిమా మొదలవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో ఉంది’’ అని చెప్పారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 

ఇక ‘సలార్‌’ (Salaar) టీజర్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ టీజర్‌ జూన్‌లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తయిందని అంటున్నారు. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush) విడుదలైన వెంటనే ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారని టాక్‌. టీజర్‌లోనే సినిమా కాన్సెప్ట్‌ను చూపనున్నారట. అయితే.. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని