Thank You: తుది అంకంలో.. ‘థ్యాంక్ యూ’
సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడు ‘థ్యాంక్ యూ’ను పూర్తి చేసేందుకు తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టారు.
సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడు ‘థ్యాంక్ యూ’ను పూర్తి చేసేందుకు తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టారు. విక్రమ్ కె.కుమార్ తెర కెక్కిస్తున్న చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ కథానాయికలు. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్లో నుంచి చైతూకి సంబంధించిన ఓ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో చైతన్య హాకీ స్టిక్ పట్టుకుని తన టీమ్‌తో కలిసి సంబరాలు చేసుకుంటున్నట్లుగా కనిపించారు. విభిన్నమైన ప్రేమ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాగచైతన్య మూడు భిన్నమైన లుక్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కథ: బి.వి.ఎస్.రవి, మాటలు: వెంకీ, మిథున్ చైతన్య.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్‌వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
-
అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్‌నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!