Samantha: ‘యశోద’ ప్రపంచం

సమంత ప్రధాన పాత్రధారిగా శ్రీదేవి మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘యశోద’. హరి - హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని గురువారం విడుదల

Updated : 06 May 2022 13:55 IST

సమంత ప్రధాన పాత్రధారిగా శ్రీదేవి మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘యశోద’. హరి - హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని గురువారం విడుదల చేశారు. ఆ వీడియోలో సమంత తన చుట్టూ కనిపించే కొత్త ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూ కనిపిస్తుంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘సమంతకి పాన్‌ ఇండియా స్థాయిలో ఉన్న గుర్తింపునకు తగ్గట్టుగా చేస్తున్న సినిమా ఇది. యశోద పాత్ర విషయంలో సమంత కనబరిచిన తపన, ఆమె పాత్రని సొంతం చేసుకున్న తీరు చాలా బాగుంటుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ చేస్తున్నాం. జూన్‌ తొలి వారానికి పూర్తవుతుంది. ఆగస్టు 12న తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీశర్మ, సంపత్‌ రాజ్‌, శత్రు, మధురిమ, కల్పికా గణేష్‌, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని