‘అవతార్‌’ తారలతో ద్విభాషా చిత్రం

ప్రపంచ సినీ జనాలను మెప్పించిన చిత్రం ‘అవతార్‌’. ఆస్కార్‌తో పాటు పలు అవార్డులను కైవసం చేసుకుంది ఈ సినిమా. ఇందులో నటించిన కొందరు నటులతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. రీల్‌ కట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న

Updated : 03 Jan 2020 08:15 IST

ఫస్ట్‌లుక్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ప్రపంచ సినీ జనాలను మెప్పించిన చిత్రం ‘అవతార్‌’. ఆస్కార్‌తో పాటు పలు అవార్డులను కైవసం చేసుకుంది ఈ సినిమా. ఇందులో నటించిన కొందరు నటులతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. రీల్‌ కట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమెరికా, యూకే, బ్రెజిల్, మలేషియాకు చెందిన నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నరేన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. నటులకు సంబంధించిన వివరాలను సస్పెన్స్‌గా ఉంచారు. జనవరి 26న ఆ వివరాలు ప్రకటించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇతర నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయి. మరియా జెరాల్డ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఫిబ్రవరి 19న లడాక్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. మన దేశంతోపాటు నేపాల్, వియత్నాం, సింగపూర్‌లలో దాదాపు 70 రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. సినీ జనాలకు ఇదో పెద్ద ట్రీట్‌గా ఉంటుందని చిత్రవర్గాలు చెప్పాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని