రైతుల పట్ల అక్కినేని అమల దాతృత్వం

ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్‌ హైదరాబాద్‌ కో ఫౌండర్‌ అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం

Updated : 13 Jun 2020 14:07 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్‌ హైదరాబాద్‌ కో ఫౌండర్‌ అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో సర్పంచి విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. ఒక్కో రైతుకు సుమారు 4కిలోల విత్తనాలను పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ... సేంద్రియ వ్యవసాయ విధానంలో పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. ఈ విధానంపై రైతులు ఆసక్తితో ముందుకు వస్తే నిపుణులైన శాస్త్రవేత్తలను పాపిరెడ్డిగూడకు పిలిపించి అవగాహన కల్పించనున్నట్లు అమల పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్‌ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమల ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని