రజనీ లుక్‌ వెనుక రహస్యం తెలిసిపోయింది..!

తమిళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన సినిమా ‘రోబో’. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు

Published : 26 Jun 2020 00:15 IST

అందరూ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అనుకున్నారట

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన సినిమా ‘రోబో’. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సత్తా చాటింది. కాగా ఈ చిత్రం ఫొటోషూట్‌లో తీసిన ఓ ఫొటోను సినిమాటోగ్రాఫర్‌ రిచార్డ్‌ ఎమ్‌ నతన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇంత వరకు ఈ లుక్‌ బయటికి రాలేదని పేర్కొన్నారు.

‘2008లో ‘రోబో’ సినిమా ఫొటోషూట్‌లో నేను తీసిన స్టిల్‌ ఇది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో తలైవా లుక్‌ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్‌ కోసం రజనీకి సిల్వర్‌ రంగు పెయింట్‌ వేశారు. ఇప్పటి వరకు విడుదల చేయని ఫొటో చూడండి..’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రజనీ ‘దర్బార్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార కథానాయిక. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయం అందుకుంది. దీని తర్వాత తలైవా ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. శివ దర్శకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని