Tollywood: టాలీవుడ్ సంగతులు.. సినిమా ముచ్చట్లు...
కిరణ్‌అబ్బవరం కథానాయకుడిగా, కశ్మీర హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీవాస్ నిర్మాత.
అందరికీ నచ్చే విష్ణు కథ
కిరణ్‌అబ్బవరం కథానాయకుడిగా, కశ్మీర హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీవాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు, కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. యువ కథానాయకుడు అఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అందరికీ నచ్చుతుందని అతిథులు ఆకాంక్షించారు.
మళ్లీ ఆస్కార్ కోసమేనా!
‘జోకర్’..ప్రపంచవ్యాప్తంగా అలరించిన చిత్రం. జోక్విన్ ఫినిక్స్ నటనకు ప్రపంచ సినీ అభిమానులు ఫిదా అయిపోవడమే కాదు ఆయనకు ఈ చిత్రం ఆస్కార్‌ను కూడా అందించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జోకర్-2’ వస్తోంది. దర్శకుడు టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాలో లేడి గగా పోషిస్తోన్న హార్లే క్వీన్ ఫస్ట్ లుక్‌ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇందులో హార్లేక్వీన్, జోక్విన్ ఫినిక్స్ సన్నిహితంగా ఉన్న ఫోటోని చూసి నెటిజన్లు ‘ఈ చిత్రం ఆస్కార్ కోసమే’ అని అంటున్నారు.
వేసవిలో ‘వెయ్.. దరువెయ్’
సాయిరామ్ శంకర్ హీరోగా నవీన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. దేవరాజు పొత్తూరు నిర్మాత. యాశ శివకుమార్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా చూడాలన్న కుతూహలాన్ని కలిగిస్తోంది’’ అన్నారు. ఈ వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం
-
Kangana Ranaut: మహేశ్ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్
-
Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
-
Ukraine : యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు పెట్టుబడులు : జెలెన్ స్కీ
-
Chandrababu Arrest: మహిళా శక్తి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత
-
Apple Devices: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్