భావోద్వేగాల కానిస్టేబుల్‌

ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన వరుణ్‌సందేశ్‌ ఓ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా... ఆర్యన్‌ సుభాన్‌.ఎస్‌.కె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది కానిస్టేబుల్‌’.

Published : 03 Jun 2023 02:36 IST

ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన వరుణ్‌సందేశ్‌ ఓ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా... ఆర్యన్‌ సుభాన్‌.ఎస్‌.కె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది కానిస్టేబుల్‌’. బలగం జగదీశ్‌ నిర్మాత. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా 5 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేర నేపథ్యంలో సాగే చిత్రమిది. ఉత్కంఠ రేకెత్తించే అంశాలున్నాయి’’ అన్నారు. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘భావోద్వేగాల్ని నింపుకున్న ఓ కానిస్టేబుల్‌ పాత్రలో నటిస్తున్నా. ఈ తరహా చిత్రం ఇదివరకెప్పుడూ చేయలేదు. దర్శకుడు తయారు చేసిన కథ, కథనం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో నటిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. దువ్వాసి మోహన్‌, సూర్య, కల్పలత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: హజరత్‌ షేక్‌, సంగీతం: సుభాస్‌ ఆనంద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని