ఆహార దేవత నయన

‘జవాన్‌’లో యాక్షన్‌ సీక్వెన్స్‌లతో అదరగొడుతూ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న నయనతార ‘అన్నపూరణి’(అన్నపూర్ణ)గా మారింది

Published : 27 Oct 2023 01:52 IST

‘జవాన్‌’లో యాక్షన్‌ సీక్వెన్స్‌లతో అదరగొడుతూ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న నయనతార ‘అన్నపూరణి’(అన్నపూర్ణ)గా మారింది. తమిళంలో నీలేష్‌ కృష్ణ దర్శకత్వంలో రానున్న తన 75వ చిత్రమది. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌... అనేది ఉపశీర్షిక. విజయదశమి వేడుకల సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను అభిమానులతో పంచుకుందామె. టీజర్‌లో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇంట్లో వాళ్లకి తెలియకుండా పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ...పేజీల మధ్యలో మాంసహార వంటలకు సంబంధించిన పుస్తకం చదువుతూ కనిపించింది. ‘‘ఈ సినిమా పట్ల మీరు చూపించే ప్రేమ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతోంది’ అంటూ దర్శకుడిని, ‘మీరు ఎంతో అద్భుతంగా చూపించిన విజువల్స్‌ను చూడాలని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది’ అంటూ సినిమాటోగ్రాఫర్‌ సత్యన్‌ సూర్యన్‌ను ట్యాగ్‌ చేస్తూ వ్యాఖ్యల్ని జోడించింది నయన. ఎప్పుడూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ  అలరించే నయన ఈ సినిమాతో కూడా  ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని