Family Star: కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్‌

తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్‌ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’.

Updated : 29 Mar 2024 11:49 IST

న కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్‌ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. పరశురామ్‌ దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ని గురువారం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. సివిల్‌ ఇంజినీర్‌ గోవర్ధన్‌గా విజయ్‌, ఇందుగా మృణాల్‌ ఠాకూర్‌ కలిసి చేసిన సందడి, ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచింది.  కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మనలో చాలా మంది ఫ్యామిలీ స్టార్స్‌ ఉంటారు. ఈ సినిమా చూశాక అందరూ అలా కావాలని కోరుకుంటారు. ఇందులో విజయ్‌ పాత్రని క్లాస్‌, మాస్‌ మేళవింపుగా మంచి వినోదం, భావోద్వేగాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ వేసవి మొత్తం ఈ సినిమా వినోదం పంచుతుంది’’ అన్నారు. దర్శకుడు పరశురామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమానీ, నాయకానాయికలు విజయ్‌, మృణాల్‌ ఠాకూర్‌నీ ప్రతి ప్రేక్షకుడు, ప్రతీ తెలుగు కుటుంబం కొన్నేళ్లపాటు గుర్తుంచుకుంటుంది. అంతగా ప్రేక్షకులకు నచ్చుతాయి. మంచి పాత్రలు, విజువల్స్‌, సంగీతం, వినోదం... ఇలా అన్నీ నచ్చేస్తాయి’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని