Chiranjeevi: చిరంజీవిని కలిసిన మాస్కో బృందం

అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది.

Updated : 19 Apr 2024 11:44 IST

గ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. అభివృద్ధి చెందుతున్న భారతీయ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలు, రష్యా సృజనాత్మక రంగాల పరస్పర సహకారం దిశగా చర్చలు జరిపారు. రష్యాలో తెలుగు సినిమాల చిత్రీకరణలని ప్రోత్సహించడంపై రష్యా బృందం తన ఆసక్తిని వ్యక్తం చేసింది. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మాస్కో ప్రభుత్వ మంత్రికి సినీ సలహాదారైన జూలియా గోలుబెవా, మాస్కో క్రియేటివ్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌, ఫెడరల్‌ ఏజెన్సీ ఫర్‌ స్ట్రాటజిక్‌ ఇన్షియేటివ్స్‌ హెడ్‌ ఎకటెరినా చెర్కెజ్‌ జాడే, యూనివర్సల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ మరియా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని