క్రిష్‌-పవన్‌ల సినిమా కథా నేపథ్యం అదేనా?

గత కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలు చేస్తున్న సంగతి  తెలిసిందే. ఆయన నటిస్తున్న

Updated : 14 Apr 2020 11:01 IST

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’ చిత్రం ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మేలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, కరోనా కారణంగా విడుదల తేదీ మారే అవకాశం ఉంది. దీంతో పాటు క్రిష్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు పవన్‌కల్యాణ్‌. ఇదొక పీరియాడికల్‌ డ్రామా అని ఇప్పటికే టాక్‌. తాజాగా దీనికి సంబంధించి మరో టాక్‌ వినిపిస్తోంది. అది కూడా మెగా బ్రదర్‌ నాగబాబు నోటి నుంచి రావడంతో ప్రస్తుతం టాలీవుడ్‌ ఈ వార్త హాట్‌ టాపిక్‌ అయింది. 

పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమాల గురించి అప్‌డేట్‌ ఏదైనా ఉంటే చెప్పమని సోషల్‌ మీడియా వేదికగా ఓ అభిమాని నాగబాబును ప్రశ్నించగా, సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు తనకు ఆలస్యంగా తెలుస్తాయని, వాట్సాప్‌ల్లో, సోషల్‌మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతాయని చెబుతూనే, పవన్‌-క్రిష్‌ల సినిమాకు సంబంధించి ఆయన ఓ విషయాన్ని పంచుకున్నారు. ‘‘నాకు తెలిసినంత వరకూ పవన్‌-క్రిష్‌ల కాంబినేషన్‌ వస్తున్న సినిమా మొగలాయ్‌ల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌, వారియర్‌ కథ అని అంటున్నారు. కోహినూర్‌ వజ్రం నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. టైటిల్‌ నాకు తెలియదు. నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. దీంతో పవన్‌ కొత్త సినిమా గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. మరి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలనే నాగబాబు చెప్పారా? లేక అసలు పాయింట్‌ చెప్పేశారా?అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

దీంతో పాటు పవన్‌ తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌’ గురించి మాట్లాడుతూ.. హిందీలో అమితాబ్‌, తమిళంలో అజిత్‌ చేసిన సినిమాల కన్నా ఇందులో ఇంకొన్ని పాయింట్లు అదనంగా జోడించినట్లు నాగబాబు తెలిపారు. ఆ రెండు సినిమాల కన్నా ఇది ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘మంచి సినిమా అవుతుంది. నాకూ చేయడం ఆసక్తిగా ఉంది’ అని పవన్‌ తనతో అన్నట్లు చెప్పారు మెగా బ్రదర్‌. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని