Bedurulanka 2012: బెదురులంక ప్రపంచం

కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్‌ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు.

Updated : 22 Dec 2022 07:21 IST

కార్తికేయ (Kartikeya) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహాశెట్టి  (Neha Shetty) కథానాయిక. క్లాక్స్‌ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. సి.యువరాజ్‌ సమర్పకులు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ‘ది వరల్డ్‌ ఆఫ్‌ బెదురులంక’ పేరుతో ఓ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. నాయకానాయికలతోపాటు కొన్ని పాత్రల్ని పరిచయం చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో, ఆ ఇద్దరి మధ్య సన్నివేశాలు అంతకంటే బాగుంటాయి. ప్రేక్షకుల నుంచి వీడియోకి వచ్చిన స్పందన ఎంతో తృప్తినిచ్చింది. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘అందరినీ నవ్వించే కొత్త తరహా ప్రయత్నమిది’’ అన్నారు. యుగాంతం ప్రచారం నేపథ్యంలో సాగే కథ ఇది. అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని