GOAT :ఆగస్టులో ‘గోట్‌’ రాక?

గతేడాది ‘లియో’తో భారీ విజయాన్ని అందుకున్న తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ ప్రస్తుతం ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్నారు.

Updated : 25 Mar 2024 09:27 IST

గతేడాది ‘లియో’తో భారీ విజయాన్ని అందుకున్న తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ ప్రస్తుతం ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. త్వరలో నిర్మాణానంతర పనుల కోసం రష్యాకి వెళ్లనున్నట్లు ఇటీవలే దర్శకుడు తెలిపారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మేలో మొదటి గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు విజయ్‌. ప్రభుదేవా, స్నేహ, లైలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు దర్శకుడు తెరవెనుక విజయ్‌తో కలిసి ఫస్ట్‌లుక్‌ కోసం సిద్ధమవుతున్న ఫొటోను పంచుకుంటూ..‘‘గోట్‌’ ఫస్ట్‌లుక్‌ మేకింగ్‌ పిక్‌ విత్‌ నా తళపతి’’ అని వ్యాఖ్యల్ని జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని