Akhil: అఖిల్‌ పరిచయ సన్నివేశాల కోసం భారీ ఏర్పాట్లు...!

అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Published : 18 Sep 2022 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అఖిల్‌ పరిచయ సన్నివేశాల కోసం చిత్రబృందం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ కోసం భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారట. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండడంతో ఫ్యాన్స్‌కు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవ్వనుంది. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని