HanuMan: ‘హను-మాన్‌’ అంతర్జాతీయ చిత్రం..: ప్రశాంత్ వర్మ

‘హను-మాన్‌’ టీజర్‌ ఇటీవల విడుదలై విజువల్‌ వండర్‌ అనిపిచుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడారు. 

Published : 23 Nov 2022 19:02 IST

హైదరాబాద్‌: యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హను-మాన్‌’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. రిలీజ్‌ అయినప్పటి నుంచి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటూ అందరినీ ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఈ టీజర్‌ గురించి చిత్ర దర్శకుడు మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
‘‘నాకు చిన్నప్పటి నుంచి హనుమంతుడు చాలా ఇష్టం. ఇంత భారీ బడ్జెట్‌తో ఆయనపై సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్‌ మేము అనుకున్నదాని కంటే 6 రెట్లు ఎక్కువైంది. ఇది తెలుగు సినిమా మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయి సినిమా. హనుమంతుడు గొప్ప వీరుడు. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్‌ కంటే శక్తిమంతుడు. నాకు మొదటి నుంచి పౌరాణిక కథలు వినడం, చదవడం చాలా ఇష్టం. ఈ సినిమాలో అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించాం. అది అద్భుతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని కోసం  ఎన్నో వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలతో కలిసి పనిచేశాం. ఈ సినిమాను ఇతరభాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ప్రశాంత్‌వర్మ చెప్పారు. తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్‌ నటిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని