Harish Shankar: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నెటిజన్ ట్వీట్‌.. డైరెక్టర్‌ స్ట్రాంగ్‌ రిప్లై..!

సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. తాను తెరకెక్కించనున్న సినిమా విశేషాలను వీలు కుదిరినప్పుడల్లా ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 

Published : 20 Sep 2023 13:28 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (ustaad bhagat singh). మైత్రి మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా క్వాలిటీపై అనుమానం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. దీనిపై హరీశ్‌ అసహనం వ్యక్తం చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

పవన్‌ కల్యాణ్‌.. చాలా రోజుల తర్వాత ఈనెలలోనే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా.. సగం సినిమా షూట్‌ పూర్తైందంటూ రెండు రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌.. ‘‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూట్‌ అప్పుడే 50 శాతం పూర్తి చేశావు అంట కదా అన్నా. ఇక, క్వాలిటీ సంగతి దేవుడిపైనే వేశాం’’ అంటూ చిత్రాన్ని ఉద్దేశిస్తూ కాస్త వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

ఏఎన్నార్‌ ఒక నట విశ్వ విద్యాలయం.. తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు : వెంకయ్యనాయుడు

కాగా, ఈ ట్వీట్‌పై హరీశ్‌ రిప్లై ఇస్తూ.. ‘‘అంతేకదా తమ్ముడు అంతకుమించి నువ్వేం చేయగలవు చెప్పు..? ఈలోగా కాస్త కెరీర్‌, జాబ్‌, చదువు మీద ఫోకస్‌ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు. ఆల్‌ ది బెస్ట్‌’’ అని కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తోన్న చిత్రమిది. దాంతో ఈ చిత్రంపై పవన్‌ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్‌కల్యాణ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని