Harish Shankar: సరదా ముచ్చట్లు
పవన్‌కల్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీ. ప్రస్తుతం ఈ అగ్ర కథానాయకులిద్దరూ సినిమా సెట్స్‌పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
పవన్‌కల్యాణ్ (Pawankalyan) ‘హరి హర వీర మల్లు’ (Harihara Veeramallu) సినిమాని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. ప్రభాస్ (Prabhas) ఒకేసారి మూడు సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీ. ప్రస్తుతం ఈ అగ్ర కథానాయకులిద్దరూ సినిమా సెట్స్‌పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆ సందర్భంలో కెమెరాకి చిక్కిన చిత్రాలే ఇవి. పవన్‌కల్యాణ్ ఒక పక్క చిత్రీకరణలో పాల్గొంటూనే, సెట్లో తన కొత్త సినిమాలకి సంబంధించిన చర్చల్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. తదుపరి ఆయన సినిమా చేయనున్న దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తరచూ ఈ సినిమా సెట్లో దర్శనమిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో (Project K) సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు (singeetam srinivasa rao) భాగం అయ్యారు. ‘ప్రాజెక్ట్ కె’ కూడా టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే కథ కావడం, ఆ తరహాలో ‘ఆదిత్య 369’ తీసిన అనుభవం సింగీతం శ్రీనివాసరావుకు ఉండటంతో ఆయన సలహాలు ఈ సినిమాకి కీలకంగా మారాయి. సెట్లో ఉన్న దర్శకదిగ్గజం సింగీతంతో ప్రభాస్ కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ రెండు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!