
The First Case: హిందీ ‘హిట్’ ట్రైలర్ చూశారా?
ఇంటర్నెట్ డెస్క్: ‘నీకు, లేదా నీ స్నేహితుల్లో ఎవరికైనా బ్లూ సెడాన్ కారు ఉందా?’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు రాజ్ కుమార్‌రావు(Rajkumar Rao). ఆయన పోలీస్ ఆఫీసర్‌గా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్: ది ఫస్ట్ కేస్’(HIT: The first case). సాన్య మల్హోత్ర కథానాయిక. శైలేష్ కొలను దర్శకుడు. 2020లో విశ్వక్‌సేన్ కీలక పాత్రలో నటించిన ‘హిట్’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృక మాదిరిగానే కథ, కథానాలను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాజ్‌కుమార్‌రావు నటన, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకూ ఈ ట్రైలర్ చూసేయండి. మరోవైపు శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా ‘హిట్-2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇది కూడా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కథ ఇదీ: ప్రమాదాల్ని ముందే ఊహించి అరికట్టే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)కి చెందిన ఓ పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు రాజ్ కుమార్‌రావు. మానసికంగా తను ఒక సమస్యతో బాధపడుతుంటాడు. దాంతో అతన్ని గతం వెంటాడుతుంటుంది. కొన్నిరోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. ఇంతలోనే ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న తన ప్రేయసి డాక్టర్ నేహా (సాన్య మల్హోత్ర) కూడా అదృశ్యమవుతుంది. అప్పుడు విక్రమ్ ఈ రెండు కేసుల్ని ఎలా ఛేదించాడు?ఆయన్ని వెంటాడుతున్న గతం వెనక కథేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Andhra News: కాటేసిన కరెంటు
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం