Ileana: సినీ పరిశ్రమ ఘోరమైంది

తెలుగులో తెరకెక్కిన ‘దేవదాస్‌’తో కథానాయికగా వెండితెరకు పరిచయమై, అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు గోవా బ్యూటీ ఇలియానా. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నప్పుడే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ అనుకున్నంత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేకపోయింది.

Published : 01 Jun 2021 01:43 IST

ఘాటు వ్యాఖ్యలు చేసిన గోవా బ్యూటీ

హైదరాబాద్‌: తెలుగులో తెరకెక్కిన ‘దేవదాస్‌’తో కథానాయికగా వెండితెరకు పరిచయమై, అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు గోవా బ్యూటీ ఇలియానా. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నప్పుడే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ అనుకున్నంత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేకపోయింది. కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. చిత్ర పరిశ్రమ ఎంతో ఘోరమైందని.. ప్రజల్లో పాపులారిటీ ఉంటేనే ఇక్కడ జీవితాన్ని కొనసాగించగలమని.. పాపులారిటీ తగ్గితే అవకాశాలు దొరకడం కూడా కష్టమేనని ఆమె పేర్కొన్నారు.

ఇలియానా, ఇప్పటికే ఓ సందర్భంలో దక్షిణాది చిత్రపరిశ్రమపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం విదితమే. ఇక్కడి దర్శకులు చాలామంది తనని కేవలం గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని ఆమె అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో సినిమాలు, ఫ్యాషన్‌ షోలు చేస్తున్న తరుణంలోనే ఇలియానాకి ఆండ్రూ అనే విదేశీ ఫొటోగ్రాఫర్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ రెండేళ్ల క్రితం బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో టాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని