Janhvi Kapoor: ఆ సలహాను గౌరవిస్తాను!

సినీవారసత్వం అనే మాట ఏదో ఒక సమయంలో వినిపిస్తూనే ఉంటుంది. శ్రీదేవి (Sridevi), బోనీకపూర్‌ (Boney Kapoor)ల ముద్దుల తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్‌(Janhvi Kapoor)కి కూడా నెపోటిజం బాధ తప్పలేదు.

Updated : 10 Feb 2023 07:16 IST

సినీవారసత్వం అనే మాట ఏదో ఒక సమయంలో వినిపిస్తూనే ఉంటుంది. శ్రీదేవి (Sridevi), బోనీకపూర్‌(Boney Kapoor)ల ముద్దుల తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్‌(Janhvi Kapoor)కి కూడా నెపోటిజం బాధ తప్పలేదు. సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ గుర్తింపు కోసం కొత్తదారిలో వెళుతున్న జాన్వీని నెపోటిజం వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టాయి. పలు సందర్భాల్లో ఈ విషయంపై మాట్లాడిన జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి పంచుకుంది. ‘మనం ఎంత కష్టపడినా ..నెపో బేబీ మీకు నటించడం రాకపోతే ఎందుకు చేస్తున్నారు? అని సామాజిక మాధ్యమాల్లో అనే సూటీపోటీ మాటలు నిజంగా బాధిస్తున్నాయి. అదేసమయంలో మీరు ‘మిలీ’లో బాగా నటించారు. తరవాత సినిమాలో ఇంకా బాగా చేయండి అంటే నేను దానిని గౌరవిస్తాను’ అని చెప్పింది. ‘నేను సినిమాలను ప్రేమిస్తున్నాను. నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసు’ అని కూడా చెప్పింది. ఈ ఏడాది ‘బవాల్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రాల విడుదల కోసం ఎదురుచూస్తోంది జాన్వీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని