john abraham: అందుకే బాలీవుడ్‌కు ‘అటాక్‌’ ఇచ్చాం

బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం నటించిన అటాక్‌ సినిమా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతటా ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో సినిమా యూనిట్‌ సంతోషంలో మునిగితేలుతోంది. 

Published : 07 Apr 2022 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో నటించిన ‘అటాక్‌’ ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చిత్ర బృందం ధన్యవాదాలు  తెలిపింది. జాన్ అబ్రహాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. ‘‘వెండితెరపై మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పరిశ్రమకు మా తరఫున ఏదైనా వినూత్నంగా అందించాలనుకున్నాం. అందులో భాగమే ‘అటాక్‌’. కరోనా మూడు దశలను దాటుకుని సినిమాను విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది. అయినా మేము అనుకున్నది సాధించాం. ఈ సినిమా కోసం నిజాయితీతో శ్రమించిన ప్రతి టీమ్‌ సభ్యుడికి ధన్యవాదాలు’’ అంటూ నెటిజన్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ఈ పోస్ట్‌పై తన చిరకాల మిత్రుడైన హీరో అభిషేక్‌ బచ్చన్‌.. ‘నీకు మరింత శక్తి చేకూరాలి’ అంటూ కామెంట్‌ చేశాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు లక్ష్య రాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు