
Kangana Ranuat: దక్షిణాది తారల స్టార్డమ్ కారణమదే..!
కీలక వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్
ముంబయి: హీరోయిన్ ఓరియంటెండ్ చిత్రాల్లో నటిస్తూ బీటౌన్ క్వీన్‌గా పేరు సొంతం చేసుకున్నారు నటి కంగనా రనౌత్. విషయం ఏదైనా సరే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈ భామ తాజాగా దక్షిణాది తారలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది తారలకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ రావడానికి కారణం వాళ్లు అనుసరించే పద్ధతులు, విధానాలేనని ఆమె అన్నారు. ‘‘పుష్ప-2’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల్లో ఏ సీక్వెల్ కోసం మీరు ఎదురుచూస్తున్నారు?’’ అంటూ ఆంగ్ల పత్రిక పెట్టిన పోస్ట్‌పై కంగనా రనౌత్ స్పందించారు.
‘‘దక్షిణాది తారలు, అక్కడి కథా చిత్రాలకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించడానికి కొన్ని కారణాలు.. 1.భారతీయ సంస్కృతికి విధానాలకు దక్షిణాది తారలు ఎక్కువ గౌరవమిస్తారు. 2. వాళ్లు తమ కుటుంబాలను ప్రేమిస్తుంటారు. వాళ్ల బంధాలు పాశ్చాత్యవిధానానికి దూరంగా ఉంటాయి. 3.వాళ్ల వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనవి’’ అంటూ కంగన సౌత్ స్టార్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ వారిలా కాకుండా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దక్షిణాది తారలు ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారని ఆమె పేర్కొన్నారు.