Kantara: బాక్సాఫీస్ వద్ద ‘కాంతార’ ఓఁ.. తెలుగులోనూ రికార్డు వసూళ్లు!
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద ‘కాంతార’ (Kantara) హవా కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా క్రమం తప్పకుండా వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ‘కాంతార’ అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.44.50 కోట్లు వసూలు చేయగా, ఉత్తరాదిన ఇప్పటివరకూ రూ.96 కోట్లు రాబట్టినట్లు ప్రముఖ సినీవిశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ‘కాంతార’ తెరకెక్కింది. విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడంతో పాటు రిషబ్ నటన, క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు, అనేక రికార్డులను సైతం తిరగరాసింది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ‘కాంతార’ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Kantara OTT)
- రూ.16 కోట్లతో ‘కాంతార’మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకూ రూ.400 కోట్లు కలెక్ట్ చేసింది.
- ఇటీవల కాలంలో సినిమా విడుదలైన అన్ని మెట్రో నగరాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని, ఇంకా ప్రదర్శితమవుతున్న ఏకైక చిత్రం ‘కాంతార’.
- దేశవ్యాప్తంగా రోజూ దాదాపు 1000కు పైగా స్క్రీన్‌లపై ప్రదర్శితమవుతోంది.
- తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్‌లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Atlee: ‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
-
Airtel: ఎయిర్టెల్కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!