Kantara: ‘కాంతార’ ఓటీటీ రూమర్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత...
మంచి టాక్‌తో భారీ వసూళ్లను సొంతం చేసుకున్న సినిమా కాంతార. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. దీని పై కాంతార నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్: ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘కాంతార’(Kantara). భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతున్న ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా నవంబర్4 నుంచి ఓటీటీలోకి రానుందని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇది ప్రసారమవుతుందని గుసగుసలు మొదలయ్యాయి. మొదట కన్నడ నాట మొదలైన ఈ రూమర్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై కాంతార క్రియేటివ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గౌడ స్పందించారు. అది రూమర్ అని కొట్టిపడేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
‘‘నవంబరు 4 నుంచి కాంతార ఓటీటీలో ప్రదర్శిస్తున్నారనేది రూమర్ మాత్రమే. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది మేమే మీకు సమాచారం ఇస్తాం. ప్రస్తుతానికి ఈ వార్త మాత్రం నిజం కాదు’’ అని ట్విట్ చేశారు. గత నెలలో కన్నడలో విడుదలై బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన కాంతార సినిమా ఈనెల(అక్టోబర్) 15 నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. రిషబ్ శెట్టి(Rishab Shetty) హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?