Kareena Kapoor: అమీషాపటేల్‌ ప్రస్తావన.. మాట్లాడటానికి ఇష్టపడని కరీనా

నటి అమీషాపటేల్‌ గురించి మాట్లాడటానికి అయిష్టం వ్యక్తం చేశారు కరీనా కపూర్‌ (Kareena Kapoor). తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను అమీషా గురించి ప్రశ్నించగా.. తాను బదులివ్వాలనుకోవడం లేదన్నారు.

Published : 14 Nov 2023 01:40 IST

ముంబయి: కరణ్‌ జోహార్ (karan johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్‌’లో సందడి చేశారు కరీనా కపూర్‌ (kareena kapoor), అలియా భట్‌ (aliabhatt). ఈ సందర్భంగా వీరిద్దరూ తమ కెరీర్‌ గురించి ఎన్నో సరదా సంగతులను కరణ్‌తో పంచుకున్నారు. ఇదిలా ఉండగా, అమీషా పటేల్‌తో మాట్లాడకపోవడంపై కరీనాకపూర్‌ను కరణ్‌ ప్రశ్నించారు. దీనిపై కరీనా ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఇటీవల జరిగిన ‘గదర్‌ 2’ పార్టీకి నువ్వు ఎందుకు హాజరు కాలేదు. నీకూ అమీషాపటేల్‌కు మధ్య ఏదో హిస్టరీ ఉందంట కదా. ‘కహో నా ప్యార్‌ హై’ నువ్వు చేయాల్సిన సినిమా కదా.’’ అని కరణ్‌ అడగ్గా.. ‘‘ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు’’ అని బదులిచ్చారామె. ‘‘కరీనా.. దీపికా పదుకొణె నీకు పోటీ అనుకుంటున్నావా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నాకు తెలిసి ఇది అలియాని అడగాల్సిన ప్రశ్న. నన్ను కాదు’’ అని ఆమె జవాబిచ్చారు.

హృతిక్‌రోషన్‌ (Hrithik Roshan) కథానాయకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం ‘కహోనా ప్యార్‌ హై’ (Kaho Naa Pyaar). అమీషా పటేల్‌ కథానాయిక. హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2000లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత కరీనాకపూర్‌ను తీసుకున్నారు. రాకేశ్ రోషన్‌తో విభేదాలు తలెత్తడంతో కరీనాని ఈ సినిమా నుంచి తొలగించి.. ఆమె స్థానంలో తనని తీసుకున్నారని అమీషా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా విషయంలో అమీషా పటేల్‌ - కరీనా కపూర్‌ల మధ్య వివాదం నెలకొందని.. మాటలు తగ్గాయని గతంలో వార్తలు కూడా వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని