Kiccha Sudeep: అభిమానులకు సుదీప్‌ క్షమాపణలు.. కారణమేమిటంటే

నటుడు కిచ్చా సుదీప్‌ (Kiccha Sudeep) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తనని కలవాలనుకున్న అభిమానులను ఉద్దేశిస్తూ తాజాగా ఆయన ఓ వీడియో షేర్‌ చేశారు. 

Published : 02 Sep 2023 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన అభిమానులకు నటుడు సుదీప్‌ (Sudeep) క్షమాపణలు చెప్పారు. భద్రతాపరమైన కారణాల వల్లే తాను వారిని కలవలేకపోతున్నానని అన్నారు. ‘‘మీ అందరినీ కలవలేకపోయినందుకు క్షమించండి. అభిమానులు దూసుకురావడంతో ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో పలువురికి ఇబ్బంది ఏర్పడింది. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు అభిమానులను కలవడం లేదు. త్వరలో మీ అందరినీ కలుస్తా’’ అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను నెట్టింట షేర్‌ చేశారు.

Abhinaya: నా కల నెరవేరిన రోజది: విశాల్‌పై అభినయ ఆసక్తికర వ్యాఖ్యలు

తన పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్‌ 2 అభిమానులను కలవడం సుదీప్‌కు అలవాటు. బెంగళూరులోని తన నివాసం వద్ద పుట్టినరోజు నాడు అభిమానులతో గెట్‌ టు గెదర్‌ నిర్వహించేవారు. అలా, ఈ ఏడాది కూడా ఫ్యాన్స్‌ను కలవాలని భావించారు. కాకపోతే, అభిమానులు భారీగా తరలి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత సుదీప్‌ నటిస్తున్న చిత్రం ‘మ్యాక్స్‌’ (MAX). విజయ్‌ కార్తికేయ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని