Abhinaya: నా కల నెరవేరిన రోజది: విశాల్‌పై అభినయ ఆసక్తికర వ్యాఖ్యలు

నటుడు విశాల్‌ (Vishal)ను తాను ఎంతగానో అభిమానిస్తున్నానని నటి అభినయ (Abhinaya) తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విశాల్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

Updated : 02 Sep 2023 17:58 IST

చెన్నై: కోలీవుడ్‌ నటుడు విశాల్‌ (Vishal) ను ఉద్దేశిస్తూ నటి అభినయ (Abhinaya Anand) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాల్‌కు తాను వీరాభిమానిని అని అన్నారు. ‘ప్రేమ చదరంగం’ నుంచి ఆయన్ని ఇష్టపడుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభినయ తెలిపారు. అనంతరం విశాల్‌తో తన పెళ్లి జరగనుందంటూ వస్తోన్న వార్తలపైనా ఆమె స్పందించారు.

‘‘చిన్నప్పటి నుంచి నాకు రజనీకాంత్‌ అంటే అభిమానం. ఆ తర్వాత నేను అంతలా అభిమానించింది విశాల్‌నే. విశాల్‌ నటించిన తొలి చిత్రం ‘ప్రేమ చదరంగం’ చూసి ఆయనకు వీరాభిమానిని అయ్యా. జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలవాలనుకునేదాన్ని. ఆయన నటించిన ‘పూజ’లో నేనూ యాక్ట్‌ చేశా. కాకపోతే, ఆయన్ని కలవడానికి వీలుపడలేదు. ‘మార్క్‌ ఆంటోనీ’లో ఆయనతో మరోసారి కలిసి వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. ఇందులో నేను ఆయన భార్యగా కనిపించనున్నాను. ఆ సినిమా షూట్‌లోనే ఫస్ట్‌ టైమ్‌ ఆయన్ని కలిశా. నా కల నెరవేరిన రోజుది. ఎంతో సంతోషంగా అనిపించింది’’

ఆ బాధ ఎవరికీ రాకూడదు: భార్య మరణంపై తొలిసారి స్పందించిన నటుడు

‘‘విశాల్‌ను కలవక ముందు వరకూ ఆయనకు కోపం ఎక్కువ అనుకునేదాన్ని. కానీ ఆయన్ని కలిసిన తర్వాత మంచి వ్యక్తి అని అర్థమైంది. ఎదుటి వ్యక్తులకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటారు. అందరినీ ఒకేలా చూస్తారు. విశాల్‌కు నాకూ వివాహం అంటూ ఇటీవల ఎన్నో వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. చాలామంది మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నామని మాట్లాడుకుంటున్నారు. అది అంతా అవాస్తవం మాత్రమే’’ అని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని