Krishna Gadu Ante Oka Range Trailer: కృష్ణగాడు ప్రేమని గెలిచాడా?

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. రాజేశ్‌ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 

Updated : 27 Jul 2023 13:54 IST

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. రాజేశ్‌ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్‌కే శ్రీలత నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బుధవారం హైదరాబాద్‌లో  విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ అందమైన పల్లెటూరిలోని కృష్ణ అనే కుర్రాడి చుట్టూ సాగే కథ ఇది. ఊరితో ఎంతో అనుబంధం ఉన్న ఆ కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చాక ఏం జరిగింది? తన ప్రేమని గెలిచాడా? తండ్రి కోరికని ఎలా నెరవేర్చాడనేది తెరపైనే చూడాలి. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ సన్నివేశాలతోపాటు, యువతరానికి నచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయి’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని