Manjummel Boys: తెలుగులోకి ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’

మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ఒకటి. చిదంబరం ఎస్‌ పొదువల్‌ తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది

Updated : 27 Mar 2024 11:41 IST

ఇటీవల మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ఒకటి. చిదంబరం ఎస్‌ పొదువల్‌ తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. దీన్ని ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్‌ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇది రూ.200కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే అందుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుశీన్‌ శ్యామ్‌ సంగీతమందించగా.. షైజు ఖలీద్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని