సమంత బాటలో నాగచైతన్య
కెరీర్ విషయంలో హీరో నాగచైతన్య.. తన సతీమణి సమంతను ఫాలో అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా రాణిస్తున్న సామ్..
బాలీవుడ్‌కు హీరో ఎంట్రీ ఇవ్వనున్నారా?
హైదరాబాద్: కెరీర్ విషయంలో హీరో నాగచైతన్య.. తన సతీమణి సమంతను అనుసరిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా రాణిస్తున్న సామ్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌తో ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, వరుస ప్రేమకథా చిత్రాలతో తెలుగులో రాణిస్తున్న చైతన్య సైతం త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో నాగచైతన్య ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే చిత్రబృందం చైతన్యను సంప్రదించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు చైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ’లో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు