Pawan kalyan: ‘ఓజీ’ వచ్చేశాడు.. గ్లింప్స్‌ చూసేయండి..

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్‌డేట్స్‌ నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా ‘ఓజీ’ (OG) నుంచి గ్లింప్స్‌ విడుదలైంది.

Published : 02 Sep 2023 10:39 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ వచ్చేసింది. సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న ‘ఓజీ’ (OG) గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేడు పవన్‌ పుట్టినరోజు సందర్భంగా  విషెస్‌ చెబుతూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలానే పవన్‌ తన లుక్స్‌, డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో పవన్‌కు (Pawan kalyan) జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కనించనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి.. 

కొత్త లుక్‌లో ‘హరిహరవీరమల్లు’..
ఇక పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న మొదటి పిరియాడికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రం నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్‌ గర్జించే సింహంలా ఉన్న ఈ పోస్టర్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. చాలా రోజుల నుంచి ఏ అప్‌డేట్ ఇవ్వకుండా బర్త్‌ డేకు ఈ మూవీ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని