F3: లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా!

పూజాహెగ్డేతో కలిసి ప్రత్యేక గీతంలో ఆడిపాడారు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ‘లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా...’  అంటూ వాళ్లు చేసిన హంగామా ఎలా సాగిందో త్వరలోనే తెలిసిపోనుంది. అనిల్‌ రావిపూడి

Updated : 16 May 2022 10:55 IST

పూజాహెగ్డేతో కలిసి ప్రత్యేక గీతంలో ఆడిపాడారు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ‘లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా...’  అంటూ వాళ్లు చేసిన హంగామా ఎలా సాగిందో త్వరలోనే తెలిసిపోనుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో... వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డేలపై ఇందులో ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఆ గీతానికి సంబంధించిన లిరికల్‌ వీడియోని ఈ నెల 17న విడుదల చేస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ గీతం పార్టీ సాంగ్‌గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని సినీ వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని