NTR31: భిన్నమైన భావోద్వేగాలతో ఎన్టీఆర్‌ 31

కథానాయకుడు ఎన్టీఆర్‌ నటించనున్న 31వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Updated : 08 Dec 2023 09:29 IST

థానాయకుడు ఎన్టీఆర్‌ నటించనున్న 31వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ప్రశాంత్‌ నీల్‌ ధ్రువీకరిస్తూ.. చిత్ర కథాంశంపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ‘‘దీన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ, నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’’ అని ప్రశాంత్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ‘కేజీఎఫ్‌ 3’ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ ఇప్పటికే సిద్ధమైందని.. కాకపోతే అది తన దర్శకత్వంలో ఉంటుందా? లేదా? అన్నది స్పష్టత లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర తొలి భాగం ‘సలార్‌ పార్ట్‌ 1: ది సీజ్‌ ఫైర్‌’ పేరుతో ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని