Salaar: కథకి అనుగుణంగానే హింస

‘సలార్‌: పార్ట్‌ వన్‌ సీజ్‌ఫైర్‌’ విడుదలైన మొదటిరోజు నుంచే బాక్సాఫీసు దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. దాంతోపాటు ఇందులో హింస అధికంగా ఉందంటూ అక్కడక్కడా విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

Updated : 26 Dec 2023 09:27 IST

లార్‌: పార్ట్‌ వన్‌ సీజ్‌ఫైర్‌’ విడుదలైన మొదటిరోజు నుంచే బాక్సాఫీసు దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. దాంతోపాటు ఇందులో హింస అధికంగా ఉందంటూ అక్కడక్కడా విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అందులోని కీలకమైన వరదరాజ మన్నార్‌ పాత్ర పోషించిన కథానాయకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సోమవారం స్పందించారు. ‘నేను నటుడినే కాదు.. ఫిల్మ్‌మేకర్‌ని కూడా. కథ, పాత్రకు అనుగుణంగా హింస, రక్తపాతం ఉంటే.. గ్రాఫిక్స్‌ ద్వారా దర్శకుడు దాన్ని చూపిస్తాడు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది.  దర్శకుడు చెప్పింది నటుడు చేయాల్సిందే. చివరగా మేం ఓ చిత్రాన్ని తయారు చేసి, నియంత్రణ సంస్థ సెన్సార్‌ బోర్డు ముందుకు తీసుకెళ్తాం. వాళ్లు మా సినిమాకి ఏదో ఒక ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఫలానా వర్గాలవారు మాత్రమే చూడాలని చెబుతారు. మా బాధ్యత చిత్రాన్ని తయారు చేసి వాళ్ల ముందుకు తీసుకెళ్లడమే’ అంటూ చెప్పుకొచ్చారు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ లాంటి హాలీవుడ్‌ సినిమాలోని రక్తపాతం, నిర్ధాక్షిణ్యంగా చంపుకోవడాలతో పోలిస్తే.. ‘సలార్‌’ మరీ అంత హింసాత్మకంగా ఏమీ లేదన్నాడు. ప్రభాస్‌ హీరోగా.. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ‘ఏ’ సర్టిఫికెట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు