Priyanka: ఐదుపాటలు, ఓఫైట్‌.. ఆ సీన్‌ మారింది..

‘వైట్‌ టైగర్‌’ అనే చిత్రంతో డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రవేశించారు ప్రియంకా

Published : 24 Jun 2021 16:23 IST

 ప్రతిభ నిరూపించుకునేందుకు ఓటీటీ చక్కటి వేదిక

‘‘ఒక్కఛాన్స్‌.. ఒకే ఒక్కఛాన్స్‌ అని కాళ్లరిగేలా తిరిగాల్సిన పనిలేదిప్పుడు. మనలో ప్రతిభ ఉన్నా.. వెండితెర నిరూపించుకునేందుకు అందరికీ అవకాశాలు రాకపోవచ్చు. అలా అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఓటీటీ వేదికల ద్వారా టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. కొన్నేళ్లుగా ఇండస్ర్టీలో ‘మోనోపలి’ ఉంది. కొందరి ఆధీనంలో ఫిల్మ్‌ ఇండస్ర్టీ నడుస్తోంది’’ అని వాఖ్యాలు చేశారు బాలీవుడ్‌ నటి ప్రియంకా చోప్రా. అమెరికాలో జీ5 యాప్‌ని వర్చ్యూవల్‌ సమావేశంలో ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రియంకా మాట్లాడుతూ..‘‘ సినిమా ఫార్ములాలో మార్పు వచ్చింది. ఓ ఐదు పాటలు, ఒక ఫైట్‌... అని గతంలో ఉన్న ఫార్ములా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు సినీ ప్రియులందరూ కొత్తకథలకే పట్టం కడుతున్నారు. వాటికోసం అన్వేషిస్తున్నారు. ఎంతో ఆశగా ఇండస్ర్టీలో తామేంటో నిరూపించుకుందామని కళాకారులు తిరుగుతుంటారు. కానీ ఇండ్రస్టీలో కొందరి వల్ల వారి కల నిజం కావడం లేదన్నది వాస్తవం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచంలో వినోదం, భారతసినిమా ఎదుగుదలకు మంచి రోజులు వచ్చాయి. ఆన్‌లైన్‌ స్ర్టీమింగ్‌ సర్వీసెస్‌ వచ్చాక భారతదేశంలో విడుదలయ్యే సినిమా కథల్లోనూ మార్పు వచ్చింది.’’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దేని ప్రత్యేకత దానిదే..
ఓటీటీ మాధ్యమాల్లో సినిమాలు విడుదలవుతున్నప్పట్టికీ థియటర్లలో చూసే ఆనందం వేరుగా ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే. థియేటర్లు విడుదలవ్వగానే అందులో చూసేందుకు వెంటనే వెళ్తా.. ఆ అనుభూతి స్పెషల్‌గా ఉంటుంది. కాకపోతే ఓటీటీ మాధ్యమాల్లో ఇంటిల్లిపాది ఆనందంగా చూసే వెసులు బాటు దొరికింది.

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి..
మనలో కంటెంట్‌ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం ఆదరిస్తుంది. ఇందుకు భారత దేశంలో విడులయ్యే ప్రాంతీయ చిత్రాలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఆరేళ్లక్రితం నేను ప్రాంత్రీయ చిత్రాలు నిర్మించడానికి ముందు వచ్చినప్పుడు అప్పుడప్పుడే ఈ జోరు ప్రారంభమవుతోంది. కానీ ఇప్పుడు.. భారత్‌, చైనా..ఇలా ఏదేశంలో చూసినా భారతదేశంలో విడుదలయ్యే ప్రాంతీయ భాష చిత్రాలకు ప్రేక్షాకదరణ పెరుగుతోంది.

లోకల్‌ కంటెంట్‌తో నిరూపిస్తున్నారు
తమని తాము నిరూపించుకోవాలనే దృఢసంకల్పం ముఖ్యంగా దక్షిణాసియాలో విపరీతంగా ఉంది. ఈ ఆన్‌లైన్‌ వేదికల ద్వారా వారు ప్రతిభని చాటుతున్నారు. అంతేకాదు..ప్రపంచమూ వారిని గుర్తిస్తోంది. ఈ ఏడాది విడుదలైన ‘వైట్‌ టైగర్‌’ అనే చిత్రంతో డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రవేశించారు ప్రియంకా. అంతే కాదు.. వెంటిలేటర్‌, పానీ అనే రెండు చిత్రాలను పర్పుల్‌ పెబిల్‌ పిక్చర్స్‌ అనే తన సొంత బ్యానర్‌ పై నిర్మించి విమర్శకుల ప్రశంసలూ పొందారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని