Rajamouli: హాలీవుడ్‌ వేడుకలో రాజమౌళి

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కొన్ని నెలలుగా అమెరికాలో గడుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రత్యేక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.

Updated : 21 Nov 2022 07:21 IST

గ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) కొన్ని నెలలుగా అమెరికాలో గడుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రత్యేక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. తాజాగా అకాడెమీ అవార్డ్స్‌ నిర్వహించే గవర్నర్స్‌ అవార్డుల వేడుకలో సందడి చేశారు. ఆస్కార్‌ పురస్కారాల్ని ప్రదానం చేయడానికి ముందు అకాడెమీ బోర్డ్‌ గవర్నర్లు సినీ పరిశ్రమకి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకి అందజేసే పురస్కారాలు ఇవి. ఈనెల 19న లాస్‌ఏంజెల్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాలీవుడ్‌ ప్రముఖులతోపాటు, రాజమౌళి హాజరయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరో కార్యక్రమంలో ఆయన తను తదుపరి మహేష్‌తో చేయనున్న చిత్రం గురించి చెప్పుకొచ్చారు. ‘‘నాకు ఇష్టమైన సినిమాల్లో ‘ఇండియానా జోన్స్‌’ ఒకటి. డాన్‌బ్రౌన్‌ రచనలన్నా ఇష్టం. ఆ తరహా కథలతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉంది. నా తదుపరి చిత్రం సాహస గాథగానే ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయ’’ని అన్నారు రాజమౌళి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని