Ram Charan: ఆ మాటలు విన్నప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాం: రామ్‌చరణ్‌

నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. తన కుమార్తె క్లీంకార పుట్టి నెల రోజులు అవుతోన్న సందర్భంగా ఆయన ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Updated : 20 Jul 2023 18:45 IST

హైదరాబాద్‌: తన సతీమణి ఉపాసన (Upasana)కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ఈ పదకొండేళ్ల తమ వైవాహిక బంధంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు. అలాగే, ఈ రోజుతో తమ కుమార్తె క్లీంకార (Klinkaara) జన్మించి నెల రోజులు అవుతోన్న సందర్భంగా.. పాప పుట్టిన సమయంలో (జూన్‌ 20) తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోతో ఆయన తెలియజేశారు. క్లీంకార నామకారణ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ని సైతం ఇందులో పొందుపరిచారు.

‘‘పదకొండేళ్లు అయిపోయింది ఇద్దరూ ఏం చేస్తున్నారు? అంటూ ఎంతోమంది అన్న మాటలకు మేము ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాం. ఏదైనా సరే సరైన సమయంలోనే జరుగుతుందని నేను నమ్ముతుంటాను. అలా, క్లీంకార సరైన సమయంలోనే మా జీవితాల్లోకి అడుగుపెట్టింది. పాపను పట్టుకున్న మొదటి క్షణం ఎంతో సంతోషంగా అనిపించింది’’ అని రామ్‌చరణ్‌ తెలిపారు.

సినీ ప్రేక్షకులకు ‘బేబీ’ దర్శకుడు క్షమాపణ

‘‘ఎనిమిది నెలలు చాలా సాధారణంగా గడిచిపోయాయి. ఆ తర్వాతే నిజమైన ఆట మొదలైంది. అమ్మనవడంతో నేను పరిపూర్ణమైన మహిళగా మారా. మా పాపపై మీరు (అభిమానులు) చూపిస్తోన్న అమితమైన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. పాపకు ఇప్పుడే ట్యాగ్స్‌ను ఇవ్వడం నాకు ఇష్టం లేదు. హార్డ్‌వర్క్‌తో వాళ్ల టైటిల్స్‌ను వాళ్లే సాధించుకోవాలి’’ అని ఉపాసన అన్నారు. ఇక, నామకరణం రోజున కుమార్తెను చేతుల్లోకి తీసుకుని ఉపాసన ఉద్వేగానికి గురయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని