Sai Rajesh: సినీ ప్రేక్షకులకు ‘బేబీ’ దర్శకుడు క్షమాపణ

టాలీవుడ్‌లో తాజాగా మంచి విజయాన్ని అందుకున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ (Baby). ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయంలో దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai rajesh) తాజాగా క్షమాపణలు చెప్పారు.

Published : 20 Jul 2023 16:18 IST

హైదరాబాద్‌: రీసెంట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ (Baby)తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh). సినిమా సక్సెస్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినీ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. చిత్రంలో ఉపయోగించిన పలు డైలాగ్స్‌ పట్ల విమర్శలు రావడంపై ఆయన స్పందించారు. అవసరం ఉన్నందు వల్లే తాను కొన్ని సీన్స్‌లో అభ్యంతరకర పదాలు వాడానన్నారు.

‘‘హీరోహీరోయిన్స్‌ మధ్య స్ట్రాంగ్‌ లవ్‌స్టోరీ ఉన్నట్లు సినిమా ఆరంభంలో చూపించా. హీరో తన మాటలతో హింసిస్తే కానీ హీరోయిన్‌ వేరే వైపునకు మనసు మళ్లించుకోదు. ఆ సీన్‌కు అనుగుణంగా ఇంటర్వెల్‌ పార్ట్‌లో కొన్ని అభ్యంతరకర పదాలు వాడాల్సి వచ్చింది. అలాగే, ‘తెరవాల్సింది కళ్లు కాదు..’ అనే డైలాగ్‌ను సినిమాలో ఉపయోగించినందుకు సారీ చెబుతున్నా. ఆ మాటలు రాయకుండా ఉండాల్సింది. మిగతావన్నీ సినిమాకు కచ్చితంగా కావాల్సినవే. ఇక, సినిమా లెంగ్త్‌ విషయంలో మొదట్లో విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ప్రతిఒక్కరూ నిడివిని పట్టించుకోకుండా సినిమా ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ కోసం మొదట 16 నిమిషాల సీన్‌ క్రియేట్‌ చేశా. ఎంతో కష్టపడి ఎడిట్‌ చేసి 7 నిమిషాలకు తీసుకువచ్చా’’ అని ఆయన తెలిపారు.

ఈ వారం ఓటీటీలో అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు.. ఇవే..!

ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) - వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) - విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఇది సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా అంతటా సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. సినిమాలోని పాటలు, డైలాగ్స్‌.. నేటితరం యువతను ఆకట్టుకునేలా ఉందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని