Akira: అకీరా సినీ ఎంట్రీపై విమర్శలు.. రేణూ దేశాయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

అకీరా నందన్‌ సినీ ఎంట్రీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేణూ దేశాయ్‌ స్పందించారు. ఓ నెటిజన్‌కు ఆమె స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.

Updated : 23 Aug 2023 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్‌ సినీ ఎంట్రీపై రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మనవడితో కలిసి అకీరా (Akira Nandan) అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు. దీంతో అభిమానులంతా త్వరలోనే అతడు సినిమాల్లో నటించనున్నాడని సంతోషపడుతున్నారు. మరోవైపు పలువురు విమర్శలు చేస్తున్నారు. వారసులకు సులువుగా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి.. ఇది ఎంత వరకు సమంజసం? అంటూ ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. రేణూ దేశాయ్ (Renu Desai) అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.

ఆ విషయం దిల్‌రాజుకు కూడా తెలియదట!

‘‘మీరు మంచి ప్రశ్నే అడిగారు.. అంబానీ తన కంపెనీని తన సంతానానికి కాకుండా బయటి వ్యక్తులకు ఇస్తే అది సమంజసం అంటారా? ఇదీ అంతే.. చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వాళ్లు వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయినా.. నటులుగా వాళ్లని వాళ్లు నిరూపించుకోవడంలో విఫలమైనా.. కొందరు వారిని ఏమాత్రం జాలి లేకుండా దారుణంగా ట్రోల్‌ చేస్తారు. అదే.. స్టార్‌ వారసులు కాకుండా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు విఫలమైతే ఎవరూ పట్టించుకోరు. వాళ్లు సక్సెస్‌ అయితే మాత్రం గొప్ప స్టార్స్‌ అవుతారు. ఇక్కడ విషయమేమిటంటే.. వారసులు రావడం ముఖ్యం కాదు. వాళ్లలోని ప్రతిభ ముఖ్యం. టాలెంట్‌ ఆధారంగా స్టార్స్‌ అవుతారు కానీ.. వారసులు కావడం వల్ల కాదు’’ అని అన్నారు.

ఇక ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన రేణూ.. అకీరా ఇంకా సినిమాల్లోకి రాకముందే అతడిని ఇంతగా విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాగే అతడికి హీరో అవ్వాలని లేదని.. రోజులో ఎన్నో గంటలు కష్టపడి పియానో నేర్చుకుంటున్నాడని ఆమె చెప్పారు. ఏ కళ కూడా సులభంగా రాదని రేణూ దేశాయ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు