Game Changer: ఆ విషయం దిల్‌రాజుకు కూడా తెలియదట!

రామ్‌ చరణ్‌-శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాపై నిర్మాత దిల్‌రాజు ఓ ఈవెంట్‌లో మాట్లాడారు.

Published : 23 Aug 2023 01:49 IST

హైదరాబాద్‌: రామ్ చరణ్‌ హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. తాజాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా రానున్న ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దిల్‌రాజు హాజరయ్యారు. వేదికపై ఆయన మాట్లాడుతుండగా ప్రేక్షకులంతా ఆయన్ని ‘గేమ్‌ ఛేంజర్‌’పై అప్‌డేట్‌ ఇవ్వాలని కోరారు. దీంతో అప్‌డేట్స్‌ కావాలంటే శంకర్‌ను అడగాలని దిల్‌రాజు అన్నారు. ఆయన మాత్రమే ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి చెబుతారని తెలిపారు. ఆయన చెప్పే వరకూ వేచి ఉండాలన్నారు.

ఇక ప్రస్తుతం రామ్‌చరణ్‌ సినిమాలకు సంబంధించిన రెండు విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’లో క్లైమాక్స్‌ సన్నివేశం హైలైట్‌ కానుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15కి విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కొన్నిరోజుల విరామం తర్వాత దీని షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

సినీ పరిశ్రమలో ఎంతో మందికి చిరంజీవి స్ఫూర్తి: విజయ్ దేవరకొండ

మరోవైపు బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్‌ నటించనున్న మూవీకి సంబంధించి కూడా ఓ క్రేజీ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభించి చివర్లో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని తారాగణాన్ని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ని, ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌సేతుపతిని తీసుకోనున్నారట. అలాగే ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది రామ్‌ చరణ్‌కు సంబంధించిన రెండు సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని