Kantara: ఆ మాట ఎన్టీఆర్‌కు సరిగ్గా సరిపోతుంది.. : కాంతార హీరో రిషబ్‌ శెట్టి

కాంతార హీరో రిషబ్‌ శెట్టి తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడాడు. అమితాబ్‌ బచ్చన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Updated : 20 Nov 2022 13:19 IST

హైదరాబాద్‌: రిషబ్‌శెట్టి.. కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో అందరి నోట వినిపిస్తోన్న పేరు. కాంతర సినిమా దర్శకుడిగా, హీరోగా తనేంటో నిరూపించుకొని అందరి ప్రశంసలు పొందుతున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా రిషబ్‌శెట్టి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పలువురు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘కమల్‌ హాసన్‌.. ఆయన నటనలో దేవుడితో సమానం. ఇక అమితాబ్‌ బచ్చన్‌కు నేను వీరాభిమానిని. బిగ్‌బీ నటించిన ప్రతి సినిమాను చూస్తాను. కాంతార సినిమాలోని శివ పాత్రకు అమితాబ్‌ ‘యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌’ సినిమాలోని పాత్రకు దగ్గర పోలికలు ఉంటాయి. ఈ సినిమాలోని అమితాబ్‌ పాత్ర నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది’’ అన్నాడు. ఇక టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, కేజీయఫ్‌ స్టార్‌ యశ్‌ గురించి మాట్లాడుతూ..‘‘ఎన్టీఆర్‌ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతారు. అద్భుతంగా నటిస్తాడు. ‘ఎనర్జిటిక్‌ పెర్ఫార్మర్‌’ అనే మాట తనకు సరిగ్గా సరిపోతుంది. యశ్ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సినీరంగ ప్రవేశం చేసి మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ విషయంలో యశ్‌ చాలా మందికి స్ఫూర్తి’’ అంటూ ప్రశంసించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని