Samantha: విజయ్‌ దేవరకొండ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పిన సమంత

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్‌, సమంత ఒకరి ఇష్టాలు మరొకరు తెలిపారు.

Published : 17 Aug 2023 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Devarkonda)కు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో సమంత (Samantha) చెప్పారు. ఈ ఇద్దరు కలిసి నటించిన ప్రేమ కథాచిత్రం ‘ఖుషి’ (Kushi). ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సందర్భంగా వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా ఒకరి ఇష్టాలను మరొకరు తెలిపారు. విజయ్‌ భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై సమంత స్పందిస్తూ.. ‘ఆమె చాలా సాధారణంగా ఉండాలి. అతడి కుటుంబంతో కలిసిపోవాలి’ అని తెలిపారు. సమంత సమాధానాన్ని విజయ్‌ అంగీకరించారు. విజయ్‌ ఫోన్‌ కాల్స్‌ తక్కువగా మాట్లాడతాడని, మెసేజ్‌లు ఎక్కువగా చేస్తుంటాడని సమంత పేర్కొన్నారు. ‘‘ఇటీవల విడుదలైన వాటిల్లో విజయ్‌కు బాగా నచ్చిన చిత్రం ‘బేబీ’ (Baby). గేమింగ్‌ యాప్‌ ఎక్కువగా వాడుతుంటాడు. అతడికి స్నేహితులు చాలామంది ఉన్నారు’’ అని సమంత తెలిపారు.

సమంత కష్టం గురించి చెప్పలేను.. ఆమె నవ్వు చూడాలి: విజయ్‌

‘‘రాహుల్‌ రవీంద్రన్‌, చిన్మయి, నీరజ కోన, మేఘన.. వీళ్లు సమంత బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అన్ని రకాల వంటలను సామ్‌ ఆస్వాదిస్తుంది. ఎంత కోపమొచ్చినా ఆమె అసభ్యంగా మాట్లాడదు’’ అని విజయ్‌ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘ఖుషి’లో విప్లవ్‌గా విజయ్‌, ఆరాధ్యగా సమంత కనిపించనున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ సినిమా మ్యూజికల్‌ ఈవెంట్‌లో విజయ్‌, సామ్‌ స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి అలరించారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమాకి ముందు వీరిద్దరు ‘మహానటి’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని