Published : 06/12/2021 01:29 IST

Samanta: నేను నేర్చుకుంది అదే..: సమంత

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి.. సమంత. గ్లామర్‌ పాత్రలు చేస్తూనే మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది.  తాజాగా ఇన్‌స్టా స్టోరీల్లో పలు పోస్టులు పెట్టింది. ఒక పోస్టులో ‘‘నా జీవితంలో నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఏంటంటే.. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుసుకోవడమే’’అని పేర్కొంది. ‘‘చాలా విషయాల్లో మంచే జరుగుతుంది అనుకుంటాం. కానీ.. అన్నీంట్లో అలా జరగదు. కొన్నిసార్లు మీరు గొప్ప పోరాటం చేసినా ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు గట్టిగా పట్టుకున్నా.. వదిలేయడం తప్ప మరో మార్గం లేదని గ్రహిస్తారు’’అంటూ ప్రముఖ రచయిత్రి చెరిల్‌ స్ట్రెయిడ్‌ వ్యాఖ్యలతో మరో పోస్టు చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ‘కాతువాకుల రెండు కాదల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప’ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో సమంత కనిపించనుంది. వీటితో పాటు, డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఓకే చెప్పింది. మరోవైపు ప్రముఖ కథానాయిక తాప్సి నిర్మాణంలో తెరకెక్కే ఓ చిత్రంతో బాలీవుడ్‌లో, మరో చిత్రంతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుంది.  

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్