ఇదెక్కడి అభిమానమో.. అప్డేట్ లేకపోయినా ట్రెండింగ్‌లోకి..
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌కు మార్కెట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వెండితెరపై ఆయన్ని చూసేందుకు సుమారు మూడేళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.....
ముంబయి: బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్‌కు మార్కెట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వెండితెరపై ఆయన్ని చూసేందుకు సుమారు మూడేళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో షారుఖ్, ఆయన చేస్తోన్న సినిమాలకు సంబంధించి ఎలాంటి టాపిక్ బయటకు వచ్చినా.. అది వెంటనే సోషల్‌మీడియా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతుంది. కానీ, తాజాగా ఎలాంటి అప్డేట్ లేకపోయినప్పటికీ కేవలం ఒక్క చిన్న విషయంతో ఆయన పేరు సోషల్‌మీడియాలో దూసుకెళ్లింది. ట్రెండింగ్‌కి కారణమైన విషయమేమిటంటే.. షారుఖ్ ఇంటి నేమ్ ప్లేట్ మార్చడం.
ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే బాంద్రాలో షారుఖ్ ఖాన్‌కు భవంతి ఉంది. తమ అభిరుచులకు అనుగుణంగా షారుఖ్, ఆయన సతీమణి గౌరీ ఖాన్ ఈ ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఈ ఇంటికి ‘మన్నత్’ అని పేరు పెట్టారు. సుమారు రూ.200 కోట్లు విలువచేసే ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ నివాసం ఉంటున్నారు. ఇప్పటివరకూ ఆ ఇంటి నేమ్ ప్లేట్‌ను పలుమార్లు మార్చారు. ఈక్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో ‘మన్నత్’ నేమ్ ప్లేట్‌ని మార్చారు. ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమివ్వడంతో వైరల్‌గా మారాయి. అలా, ‘షారుఖ్‌ఖాన్’, ‘మన్నత్’ ట్రెండింగ్‌లోకి చేరాయి. అది చూసిన పలువురు నెటిజన్లు.. ‘‘ఇదెక్కడి అభిమానమో..’’ అని కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.