Shamshera: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న రణ్‌బీర్‌ ‘న్యూలుక్‌’

గుబురుగడ్డం, సూటిగా చూస్తున్న కళ్లు, చేతిలో గొడ్డలితో ఉన్న రణ్‌బీర్‌కపూర్‌ కొత్త సినిమా పోస్టర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

Published : 18 Jun 2022 15:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుబురుగడ్డం, సూటిగా చూస్తున్న కళ్లు, చేతిలో గొడ్డలితో ఉన్న రణ్‌బీర్‌కపూర్‌ కొత్త సినిమా పోస్టర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇది త్వరలో విడుదల కానున్న రణ్‌బీర్‌ సినిమా ‘షంషేరా’లో లుక్‌గా తెలుస్తోంది. కరణ్‌ మల్హోత్ర దర్శత్వంలో ప్రముఖ ‘యశ్‌ రాజ్‌ ఫిల్స్మ్‌’ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న  ‘షంషేరా’ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్రకాంక్ష కలిగిన, దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నాడు. దానికి సంబంధించిన ఆహార్యంతో ఉన్న పోస్టర్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘సంజు’ సినిమా హిట్‌ తర్వాత రణ్‌బీర్‌ది ఇంతవరకు ఏ చిత్రం విడుదలవ్వలేదు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల అనంతరం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతున్న ‘షంషేరా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2022, జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్‌ ఇదివరకే ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని