Sharwanand: రజనీ చిత్రంలో శర్వానంద్‌

అగ్ర తారలైన అమితాబ్‌ బచ్చన్‌... రజనీకాంత్‌లతో కలిసి తెరని పంచుకునే ఒక  అరుదైన అవకాశం సొంతం చేసుకున్నారు శర్వానంద్‌.

Updated : 17 Aug 2023 14:18 IST

గ్ర తారలైన అమితాబ్‌ బచ్చన్‌... రజనీకాంత్‌లతో కలిసి తెరని పంచుకునే ఒక  అరుదైన అవకాశం సొంతం చేసుకున్నారు శర్వానంద్‌. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమాలో యువ కథానాయకుడు పోషించాల్సిన ఓ కీలక పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. ఆ అవకాశం శర్వానంద్‌కి దక్కింది.  రజనీకాంత్‌కి 170వ చిత్రం  కాగా, ఆయన అమితాబ్‌తో  కలిసి దాదాపు 32 ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం కూడా ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని